డ్రగ్స్ నివారణలో ప్రపంచంలోనే తెలంగాణ అగ్రస్థానం: సిఎం హర్షం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

మాదక ద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి తెలంగాణ పోలీసు ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

‘ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్’ కేటగిరీలో మొదటి బహుమతిని అందుకున్న సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి ని మర్యాద పూర్వకంగా కలిశారు.

దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్‌లో హైదరాబాద్ సీపీ ఈ బహుమతి అందుకున్నాను. ఈ సందర్భంగా కమిషనర్ ని ముఖ్యమంత్రి అభినందించారు.

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు కృషి చేస్తున్న ప్రతి పోలీస్ కు మద్దతుగా ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ నివారణలో ప్రపంచంలోనే తెలంగాణ అగ్రస్థానం సాధించడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. 138 దేశాలతో పోటీపడి ప్రథమ స్థానం సాధించడం గర్వంగా ఉందని అన్నారు. ఈ ఘనత సాధించిన హైదరాబాద్ నగర కమీషనర్ సి.వి.ఆనంద్, ఆయన బృందానికి అభినందనలు తెలియజేశారు. ప్రపంచానికే తెలంగాణ రోల్ మోడల్ గా ఉండాలన్నదే నా ఆకాంక్ష అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.