కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

Facebook
X
LinkedIn

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు

తెలుగునాడు, హైదరాబాద్ :

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణ రావు గురువారం జిల్లా పర్యటనలో భాగంగా కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

   కొడంగల్ ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాట్లు చేస్తున్నందున ప్రస్తుతం కొనసాగుతున్న 50 పడకల ఆసుపత్రిని  220 పడకల ఆసుపత్రిగా సామర్థ్యాన్ని పెంచుతూ నిర్మించబడుతున్న పనులను ఆయన పరిశీలించారు.  ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధింత ఇంజనీరింగ్ విభాగ అధికారులకు సూచించారు.   ఆసుపత్రికి రోజువారీగా వస్తున్న వివరాలను, ఆస్పత్రిలో నిర్వహిస్తున్న ప్రసవాల సంఖ్య పై ప్రధాన కార్యదర్శి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి  విద్యార్థినీల, సిబ్బంది వివరాలపై ఆయన ఆరా తీశారు.

   అనంతరం హరే కృష్ణ సంస్థ ద్వారా పాఠశాలకు  అల్పాహార సరఫరా చేస్తున్న కిచెన్ షెడ్ ను ప్రధాన కార్యదర్శి పరిశీలించారు.

    ప్రధాన కార్యదర్శి పర్యటనలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి,   తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఆనంద్,  వైద్య కళాశాల ప్రిన్సిపల్ పద్మ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్  లిల్లీ మేరీ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్ర ప్రియ, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్,  తహసిల్దార్ విజయ కుమార్ లు పాల్గొన్నారు.