తెలుగునాడు, హైదరాబాద్ :
ఛత్తీస్ ఘడ్ కర్రె గుట్టలో మావోయిస్టుల తో జరిగిన పోరులో వీర మరణం పొందిన జవాన్ సందీప్ అంతిమ సంస్కార కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపి ఈటెల రాజేందర్ మరియు మేడ్చల్ నియోజకవర్గ కంటేస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
ఒకవైపు ముష్కర దాయాది దేశం పాకిస్తాన్ వంటి దేశాలతో పోరు సలుపుతున్న భారతదేశం మరొకవైపు దేశంలో రాజ్యాన్ని,రాజ్యాంగాన్ని సవాల్ విసురుతూ తుపాకీ ద్వారానే రాజ్యాధికారం అంటున్న నక్సలైట్ల చేతిలో బలి కావడం బాధను కలిగిస్తుంది అని వారు విచారం వ్యక్తం చేశారు.