‘
తెలుగు నాడు, హైదరాబాద్ :
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆ సంస్థ సిబ్బంది, వాలంటీర్లు, సభ్యులందరికీ శుభాభినందనలు తెలియజేశారు. మానవత్వాన్ని సజీవంగా నిలపాలన్న లక్ష్యంతో ప్రపంచ వ్యాప్తంగా రెడ్ క్రాస్ సంస్థ ఎనలేని సేవలు అందిస్తోందని ముఖ్యమంత్రి కొనియాడారు. మహమ్మారి, వరదలు, తుపానులు, యుద్ధాలు.. ఎలాంటి విపత్తులు, ఆపత్కాలాల్లోనైనా ముందుండి రెడ్ క్రాస్ సంస్థ మానవత్వంతో అందించే నిస్వార్థ సేవలు సర్వదా అభినందనీయమని పేర్కొన్నారు.