చర్లపల్లి ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించండి

Facebook
X
LinkedIn

చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద రహదారులను విస్తరించండి

మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర కు వినతి

తెలుగునాడు, హైదరాబాద్ :


చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఈ ప్రాంతంలో రహదారుల విస్తరణ కార్యక్రమం చేపట్లేదు. దీని ద్వారా ప్రయాణికులు, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు, ఆటో కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చర్లపల్లి రైల్వే స్టేషన్ లోని ఆటో కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, రోడ్ల విస్తరణ కార్యక్రమం వెంటనే చేపట్టాలని బుధవారం మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర ను బి ఆర్ టి యు ఆటో యూనియన్ కార్మికులు కలిసి వినతిపత్రం ఇవ్వటం జరిగింది.
అదేవిధంగా ఆటో కార్మికుల సమస్యలు, ఆటో స్టాండ్ విస్తరణ, పార్కింగ్ సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీ ఈటల రాజేందర్ కి కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది వెంటనే స్పందించిన ఎంపీ రైల్వే అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ టి యు ఆటో యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ వేముల మారయ్య, కాప్రా డివిజన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, రమేష్ , నరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.