రాష్ట్ర అభివృద్ధిలో పాత్రికేయులు భాగస్వామ్యం కావాలి
-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలుగునాడు, హైదరాబాద్ :
బల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా హైదరాబాద్ మహా నగరం రూపాంతరం చెందుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు బారులు తీరుతున్నారని ఆయన చెప్పారు.
అందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూపొందిన అభివృద్ధి నమూనాను ఆకర్షించడమే అందుకు కారణమన్నారు.
మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని హెచ్.ఐ. సి.సి లో హైబీజ్ మీడియా అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీదట పారిశ్రామిక రంగంలో కల్పించిన మౌలిక సదుపాయాలను చూసి ఆకర్షించే పెట్టుబడి దారులు రాష్ట్రానికి తరలి వస్తున్నారని ఆయన చెప్పారు
దానికి తోడు ప్రపంచ స్థాయిలో పేరొందిన పరిశ్రమలను తెలంగాణా రాష్ట్రానికి రప్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు
అభివృద్ధి పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం,ఔటర్ రింగ్ రోడ్,పెరుగుతున్న జనాభాకనుగుణంగా హైదరాబాద్ కు కృష్ణా,గోదావరి జలాలను తరలించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినవేనని ఆయన గుర్తుచేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే ఫ్యూచర్ సిటీ,స్కిల్ యూనివర్సిటీ,మెట్రో నిర్మాణం చేపట్టామన్నారు.
కేవలం సంవత్సరం వ్యవదిలో గూగుల్ మైక్రో సాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసేస్,ఇన్ఫోసిస్, హెచ్.సి.ఎల్ వంటి సంస్థలు ఇప్పటికే ఉన్నాయని,ఆయా సంస్థలు క్యాంపస్ లు,డేటా సెంటర్లతో పాటు,సాంకేతిక హబ్ లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విస్తరించుకున్నాయన్నారు.

అంతే గాకుండా అమెజాన్ సన్నాఫీ, ఫెడ్ఎక్స్ లతో పాటు లండన్ కు చెందిన స్టాక్ ఎక్సేంజ్ గ్రూప్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లో కొత్తగా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో తీసుకొచ్చిన పెను మార్పులే కారణభుతంగా నిలిచాయన్నారు.
అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొంది డినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు
ఇంతటి అభివృద్ధి జరుగుతున్న తెలంగాణా రాష్ట్రంలో మీడియా భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న పత్రికా రంగం జరుగుతున్న అభివృద్ధికి బహుళ ప్రచారం కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్ద పీట వేసిందని,నిరుపేదల కళ్లలో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోనీ 84 శాతం మంది నిరుపేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిందని ఇంతకు మించిన సంక్షేమ పధకం మరోటి ఉండదని ఆయన నొక్కి వాక్కాణించారు.