రైల్వే భద్రత పెంచాలి – మౌలాలి రైల్వే స్టేషన్ వద్ద CITU ఆధ్వర్యంలో నిరసన

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

రైల్వేలో రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు ప్రోత్సాహం ఇస్తుండటాన్ని సిఐటియు నాచారం కమిటీ పి.గణేష్ తీవ్రంగా విమర్శించారు. రైల్వేల్లో భద్రతా లోపాలు, అధిక ప్రమాదాలు, మరియు ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ మౌలాలి రైల్వే స్టేషన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం కార్మికులు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. భద్రతా చర్యలు పెంచకపోతే, ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయనీ, అనవసర ప్రైవేటీకరణ వల్ల కార్మికుల భవిష్యత్తు అనిశ్చితమవుతుందనీ వారు పేర్కొన్నారు. ధర్నాలో పాల్గొన్న కార్మికులు రైళ్లలో యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని, భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని, ప్రైవేటీకరణ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, నూర్జహాన్, ఖాదర్, రాజిరెడ్డి, రాజయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు.