ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Facebook
X
LinkedIn

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

తెలుగునాడు, హైదరాబాద్ :

ఉప్పల్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం నాచారం డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందు ఉంచుతానని,
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
మంగళ వారం నాచారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగింది.
10 లక్షల రూపాయల నిధులతో స్నేహపురి కాలనీ డాక్టర్ సైదయ్య హాస్పిటల్ ముందు పార్క్ లోపల ఓపెన్ జిమ్ ఏర్పాటు కొరకు అలాగే 50 లక్షల రూపాయల నిధులతో అన్నపూర్ణ కాలనీలోని బుడగ జంగాల స్మశాన వాటిక అభివృద్ధి పనుల కొరకు స్థానిక కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ తో కలిసి భూమి పూజ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రేటర్ నాయకులు సాయి జెన్ శేఖర్ , డి ఈ బాలకృష్ణ , ఏ ఈ కీర్తి కాలనీ వాసులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.