ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలనీ కేంద్ర మంత్రి నితిన్ గట్కారీనీ కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

ఉప్పల్ ఎలివేటెడ్ పనులు త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలనీ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గట్కా రీ ని అంబర్ పేట లో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో జాప్యం జరిగిందని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. వెంటనే ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. పనులు సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గారు త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.