తెలుగునాడు, హైదరాబాద్ :
సిఐటియు మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్తమైన జయప్రదం చేయాలని కోరుతూ వాల్పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జే చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వ ప్రజా కార్మిక ,కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తు 10 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెను నిర్వహిస్తున్నామని ,ఈ సమ్మెను అన్ని రకాల సంఘాలు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు .నాలుగు లేబర్ కోడులు రద్దు చేయాలి, కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలి , కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుచెయ్యొద్దు , అధిక ధరలను అరి కట్టాలని, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లతో సమ్మెకు వెళుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ. అశోక్, జే. చంద్రశేఖర్ సహాయ కార్యదర్శి లు జి .శ్రీనివాసులు , ఐ.రాజశేఖర్ బి.లింగస్వామి, ఉపాధ్యక్షులు పి. గణేష్, వెంకన్న, ఎన్. శ్రీనివాస్, కిష్టప్ప కమిటీ సభ్యులు ఎం. చంద్రశేఖర్, బి. నరసింగరావు తదితరులు పాల్గొన్నారు .