తెలంగాణలో కాంగ్రెస్ ​ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికే ఆదర్శంగా నిలిచింది

Facebook
X
LinkedIn

ఘట్కేసర్ మునిసిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్

తెలుగునాడు, హైదరాబాద్ :

తెలంగాణలో కాంగ్రెస్ ​ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఘట్కేసర్ మునిసిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ తెలిపారు.

ఈ సర్వే యావత్​ భారతావానికి దిక్సూచిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ ,కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు (బీసీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని కాంగ్రెస్​ సర్కార్ తెలిపింది.

రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలువడిన అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాలు, అఫెర్మెటివ్ పాలసీలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్లింది. దేశ స్వాతంత్య్రం నాటి నుంచి ఎదురు చూస్తున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి సారి ఆచరించి ఆదర్శనీయంగా నిలిచింది. దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతులను అర్థం చేసుకోవడానికి, తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానించింది.

ఈనేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కులగణనపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో జనగణనతోపాటు కులగణన కూడా నిర్వహించాలనే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నది. రాబోయే జనాభా లెక్కలతో పాటు కులగణన నిర్వహించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షత రాజకీయ వ్యవహారాల కమిటీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు వివరాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. 1931లో చివరి సారిగా కుల గణన జరిగిందని, ఆటు తరువాత తెలంగాణలోనే కుల గణన జరగడం విశేషం.

రాహుల్ గాంధీ కల సాకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదములు

కుల గణన పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర కేబినెట్ మంత్రులకు అదేవిధంగా రాహుల్ గాంధీ కి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ముల్లి పావని జంగయ్య యాదవ్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.