తెలుగునాడు, హైదరాబాద్ :
తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని -తెలంగాణ డీజీపీ జితేందర్ అల్టిమేటం జారీ చేశారు.
పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవని, మెడికల్ వీసాల మీద ఉన్నవారికీ ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉందని ఆయన స్పష్టం చేశారు. లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదని ఆయన వివరించారు.
పాకిస్థానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుంచి వెళ్లొచ్చని, ఏప్రిల్ 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుందని ఆయన తెలిపారు.