జన విజ్ఞాన వేదిక జిల్లా కోశాధికారి జెన్ని
తెలుగునాడు,హైదరాబాద్ :
జన విజ్ఞాన వేదిక కాప్రా, మల్కాజ్గిరి, కీసర మండల కమిటీలు తమ సామాజిక బాధ్యతగా 116 వ నెల బిపి షుగర్ పేషెంట్స్ కోసం మెడికల్ క్యాంపు ను శ్రీ చక్రి విద్యానికేతన్ హై స్కూల్ చక్రిపురం క్రాస్ రోడ్ చక్రిపురం లో ఈ ఆదివారం 27 వ తారీకు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహిస్తున్నాయని జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా కమిటీ కోశాధికారి జన్ని తెలియజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా నిరంతరంగా మెడికల్ నిర్వహిస్తున్నందుకు మండల కమిటీలకు జన విజ్ఞాన వేదిక నాయకులకు మరియు కార్యకర్తలకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ మెడికల్ క్యాంపు లో బీపీ షుగర్ పేషెంట్ కి పరీక్షలు నిర్వహించి డాక్టర్ల సూచనల మేరకు మందుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, ఈ అవకాశాన్ని చక్రిపురం, కుషాయిగూడ, చెర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి తదితర ప్రాంతాల వారు ఉపయోగించుకోవాలని వారు కోరారు.
ఇతర వివరాల కోసం కింది ఫోన్ నెంబర్ను 9989925997, 9700616679, 9959536083 సంప్రదించవలసినదిగా వారు తెలియజేశారు.