ఐపిసి యాదాద్రి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఎడవెల్లి సరిత
తెలుగునాడు, హైదరాబాద్ :
ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ (ఐ పి సి) తెలంగాణ రాష్ట్ర యాదాద్రి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఎడవెల్లి సరిత నియమితులైనారు. ఈ మేరకు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు ఆకారపు పద్మిని నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎడవెల్లి సరిత మాట్లాడుతూ సమాజం లో మహిళలపై జరిగే అత్యాచారాలు హత్యలు ,వేదింపులు మొదలగు వాటిపై ప్రజల్లో చైతన్యo తీసుకొచ్చే విధంగా అవగాహన సదస్సులు పెడుతూ కార్యాచరణ తో ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ మధ్యపాననిషేధాన్ని అమలుపరచాలని సరిత డిమాండ్ చేశారు.
తనకు ఈ బాధ్యతలను అప్పగించిన తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆకారము పద్మిని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ లక్ష్మీ మరియు జాతీయ నాయకులకు రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ సెలవ రాజు ఈ సందర్భంగా సరితకు శుభాకాంక్షలు తెలుపుతూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.