మల్లాపురం లో టాస్కా కు జైకొట్టిన వయోధికులు
అవగాహన కల్పించిన అధ్యక్షుడు ముడుంబై జయమోహనా చార్య
తెలుగునాడు, యాదగిరిగుట్ట :
స్త్రీ కంట కన్నీరు సమాజానికి ఎంత అనర్థమో… తల్లిదండ్రుల కంట కన్నీరు పిల్లలకు శాపమే అవుతుందని యాదగిరిగుట్ట టాస్కా (తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్) మండల అధ్యక్షుడు ముడుంబై జయమోహనా చార్య ఆవేదన వ్యక్తం చేశారు . వృద్ధుల ఆశీస్సులు, అనుభవం ఉత్తమ జీవిత మార్గానికి దోహద పడుతుందన్నారు. గురువారం మండలంలోని మల్లాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ వయోధికులతో కలిసి టాస్కా ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. సాలూరు స్వామి, పెద్దమ్మల రాములు, కర్రె సత్తయ్య, కె సత్తయ్య, జీ గీరెడ్డి ధర్మారెడ్డి, ఒగ్గు స్వామి, అంకం పెంటయ్య, సుశీల, గౌడ శ్రీశైలం, కె రామచంద్రం, జీ చొక్కారెడ్డి తదితర వయోధికులతో పాటు టాస్కా సభ్యులు డాక్టర్ రాగి సహదేవ్, నూకల సుధాకర్ రెడ్డి, గుంటి యాదగిరి, గుండ్లపల్లి మల్లేశం గౌడ్ పాల్గొన్నారు.