తెలుగునాడు, హైదరాబాద్ :
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అందరికీ మే నెల అంతా ఒకేసారి సెలవు ఇవ్వాలని ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఉన్నికృష్ణన్ పాల్గొని మాట్లాడుతూ మన పక్కనే ఉన్న కర్ణాటక ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ హెల్పర్లకు ఎండలు ఉష్ణోగ్రత ఎక్కువ పెరగడం వలన ఒక నెల సెలవు ప్రకటించింది.
మన తెలంగాణ ప్రభుత్వం కూడా అంగన్వాడీ టీచర్ హెల్పర్ లందరికీ మే నెల అంతా అందరికీ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అనంతరం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జి సునీత బి శోభారాణి మాట్లాడుతూ. ఎండలు పెరగడం వలన. గర్భిణీ స్త్రీలు బాలింతలు. చిన్నపిల్లలు. ఎండలు తట్టుకోలేక సెంటర్స్ లో కూడా హాజరు శాతం తగ్గిపోతుందని. చాలా అంగన్వాడి సెంటర్లలో. సౌకర్యాలు లేవు కావున. ఎండలు దృష్టిలో పెట్టుకొని మే నెల అంతా అంగన్వా టీచర్ హెల్పర్లు అందరికీ సెలవు ఇవ్వాలని కోరారు.

ఈ విషయం మీద ఇప్పటికే శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా నెల రోజులు సెలవులు ఇవ్వడానికి ఆలోచిస్తున్నామని ప్రకటించడం జరిగింది. దయచేసి మంత్రిగారు తాము చెప్పిన ఈ నెల రోజుల సెలవులను సర్కులర్ రూపంలో విడుదల చేసి అంగన్వాడీ ఇచ్చిన మాట నిలుపుకోవాలని కోరుకుంటున్నా
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అనంతరం జిల్లా బి డబ్ల్యు ఓ కి మెమొరాండం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు.