తెలుగునాడు, హైదరాబాద్ :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా, “తెలుగు యువత, మల్కాజ్‌గిరి పార్లమెంట్ అధ్యక్షులు సాయి నాగార్జున ఆధ్వర్యంలో “ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు డా॥ ఏ ఎస్ రావు నగర్ డివిజన్, పద్మశాలి టౌన్‌షిప్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి నందమూరి సుహాసిని, TGK మూర్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి, తెలుగుదేశం పార్టీ డా॥ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు, నాగభైరవ సాంబశివరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.
