మేడ్చల్‌ జిల్లాఆరొగ్య కేంద్రాలకు వైద్యపరికరాలు అందించిన పారిశ్రామిక వేత్తలు

Facebook
X
LinkedIn

తెలుగునాడు, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి :


కార్పొరేట్‌ సామాజిక బాధ్యత భాగంగా, చెన్నైలోని కెరీర్‌ ట్రీ ఎచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌లోని యునైటెడ్‌ స్టేట్స్‌ ఫార్మకోపియా (యూఎస్పీ) సహకారంతో మేడ్చల్‌ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వినియోగం కోసం డెలివరీ బెడ్లు, బేబీ వార్మర్లు , బయోకెమిస్ట్రీ ఎనలైజర్‌లు, సెల్‌ కౌంటర్‌ మెషీన్‌లు, వంటి వైద్య పరికరాలను అంతైపల్లిలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా ఉమా గౌరీకి పరికరాలను అందచేశారు.


కెరీర్‌ ట్రీ ఎచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మరియు యునైటెడ్‌ స్టేట్స్‌ ఫార్మకోపియా (యూఎస్పీ) బృందం చేసిన కృషిని, వైద్య ఆరోగ్యశాఖకు అందించిన సేవలకు జిల్లా వైద్య అధికారి డా. ఉమా గౌరీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య మరియు అధికారి కీసర డివిజన్‌ డా సత్యవతి, కార్యాలయం సూపరింటెండెంట్‌ మహమ్మద్‌ సలీం, ఎన్‌ఎచ్‌ఎమ్‌ జిల్లా ప్రొగ్రమ్మె అధికారిని మంజుల రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.