తెలుగునాడు, హైదరాబాద్ :
ఈ నెల 27 న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరుగనున్న పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో, సభలో మహిళలకోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతం లో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు కార్యాచరణకు సంబంధిం తగిన సూచనలు చేస్తూ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం లో శుక్రవారం సమీక్షాసమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత సహా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళనేతలు, తదితరులు పాల్గొన్నారు.
వారిలో.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,
హన్మకొండ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే లు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, పార్టీ మహిళనేతలు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఎస్పీఎససి మాజీ మెంబర్ సుమిత్రా తనోబా, గిడ్డంగుల శాఖ మాజీ ఛైర్పర్సన్ రజినీ సాయిచంద్, నవీనాచారి పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే
ఆశన్న గారి జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు, కల్వకుంట్ల వంశీధర్ రావు, తదితరులు పాల్గొన్నారు.