తెలుగునాడు, కాప్రా :
బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల మనిషి అని సామాజిక ఉద్యమ నాయకులు కోమటి రవి తెలిపారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా పూలే అంబేడ్కర్ స్ఫూర్తి గ్రూప్ (ఎన్‌ఎఫ్‌సి) ఆధ్వర్యంలో ఈసీఐఎల్, ఎన్ ఎఫ్ సి సహకారంతో ఈసీఐఎల్ పరిశ్రమ ఏరియాలో గల అంబేద్కర్ భవన్ నందు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక ఉద్యమ నాయకులు కోమటి రవి మాట్లాడుతూ భారతదేశానికి రాచ పుండు లాంటిదని చెప్పి మనస్ఫూర్తిని తగులు పెట్టారని చెప్పారు. అది సకల ప్రజలకు హానికరమని చెప్పారు. నేటి పాలకులు రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను పక్కనపెట్టి తిరిగి మనువాదాన్ని పైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజాస్వామ్య హక్కులను నిరాకరిస్తున్నారు. ప్రజల సొమ్మును కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని చెప్పారు. వాటిని ఐక్యంగా ఎదుర్కొని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరారు.

జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన సభకు స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ఆహ్వానితులను పూలే అంబేద్కర్ స్ఫూర్తి గ్రూపు నాయకులు నాగరాజు వేదిక మీదకు ఆహ్వానం పలికారు. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి మల్లేశం పూలమాలవేసి నివాళులర్పించారు. పూలే అంబేడ్కర్ స్ఫూర్తి గ్రూపు ప్రారంభకులు కేకే ప్రసాద్ బాబు చిత్రపటానికి వారి సతీమణి కోటేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశానికి ప్రారంభ సూచికగా భారత రాజ్యాంగ పీఠికను పూలే అంబేద్కర్ స్ఫూర్తి గ్రూపు బాధ్యులు గోవింద్ ప్రతిజ్ఞ రూపంగా చేయడం జరిగింది. దానికి అందరూ లేచి నిలబడి పిడికిలి ముందుకు చాపి రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞగా చేయడం జరిగింది. ముందుగా పూలే అంబేద్కర్ స్ఫూర్తి గ్రూపు బాధ్యులు మల్లేశం మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో శ్రమకు వచ్చి వివక్షలను ఎదుర్కొని ప్రపంచంలోనే అతి గొప్ప చదువులు చదివారని చెప్పారు. అంబేద్కర్ తనకు గురువుగా మహాత్మ జ్యోతిరావు పూలేను స్వీకరించారు. జ్యోతిరావు పూలే ఈనాడు ఉన్న సకల వివక్షలకు విరుగుడు బడుగు బలహీన వర్గాలకు చదువు ఒక్కటే మార్గం అని భావించారని చెప్పారు. ఆయన బాటలోని ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గొప్ప కృషి చేశారని చెప్పారు. వారి భావాలకు అనుగుణంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితాంతం బడుగు బలహీన వర్గాలకు అంతేకాకుండా సకల పీడిత ప్రజానీకానికి మేలు జరిగే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించగలిగారని అది ఒక్కటే మనకు శిరోధార్యం అని చెప్పారు. సీనియర్ నాయకులు బాలకృష్ణ గారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని తీసుకొని కేకే ప్రసాద్ బాబు తన పరిధిలో గొప్ప కృషి చేశారని ఆయన కృషి ఫలితంగా వందలాదిమందికి మేలు జరిగిందని చెప్పారు. వారు లేని లోటు అందరితోపాటు నాకు ఎంతో బాధ కలిగిస్తుందని చెప్పారు. ఈసీఐఎల్ మద్దూర్ సన్ ప్రధాన కార్యదర్శి సుధీర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం గుర్తించిన గొప్ప మేధావి అని ఆయన బ్రాహ్మణీయ బహుజాలానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడే అని చెప్పారు. ఆయన బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకమే కానీ బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదని, అసలు కులాలే సరైంది కాదని చెప్పారని చెప్పారు.మాజీ ప్రిన్సిపాల్ అయిన పద్మావతి మాట్లాడుతూ అంబేద్కర్ ఒక్క దళితుల కోసమే పనిచేయలేదని సకల జనుల కోసం కృషి చేశారని చెప్పారు. ముఖ్యంగా మహిళల హక్కుల కొరకు ఎంతో కృషి చేశారని దాన్ని చట్టరూపంగా సాధనలో తనకు అనుకూలంగా లేనప్పుడు తన మంత్రి పదవినే త్యదించారు అని చెప్పారు.
జాయ్ అనే పాప బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితం గురించి ఇంగ్లీషులో గొప్పగా చెప్పడం జరిగింది.
పిల్లలకు ఆటల పోటీలు, మహిళలకు ఆటలు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈసీఐఎల్ ఎన్ ఎఫ్ సి ఉద్యోగుల కుటుంబాలు వచ్చి వైభవోపేతంగా అద్భుతంగా పాల్గొన్నారు. జై భీమ్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అని నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఆటల పోటీలు నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానం కేకే ప్రసాద్ బాబు సతీమణి కోటేశ్వరి, వారి కుమార్తె శాలిని బహుమతి ప్రధానం చేయడం జరిగింది.
అభ్యుదయంగా వివాహం చేసుకొని అందరికీ ఆదర్శంగా జీవిస్తున్న జయరాజ్ పద్మావతి దంపతులను, గొడుగు యాదగిరిరావు చల్లా లీలావతి దంపతులను చేనేత వస్త్రాలతో గౌరవించడం జరిగింది. మరియు బాలకృష్ణని, కోమటి రవిని, సుధీర్‌ని, మల్లేశంని, కృష్ణయ్యని, కోటేశ్వరిని, పద్మావతిని చేనేత వస్త్రాలతో గౌరవించడం జరిగింది. వందన సమర్పణ కార్యక్రమం పూలే అంబేద్కర్ స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గోవింద్ చెప్పారు. అనంతరం అందరూ కుటుంబాలు భోజనాలు చేసి జై భీమ్, జై రాజ్యాంగం అంటూ నినాదాలతో కార్యక్రమం ముగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోవింద్, నాగరాజు, యాదగిరి, మల్లేశం, బాలకృష్ణ, సురేష్, విజయ్ కుమార్, రాంబాబు, శివ, రామకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.