శ్రీరామనవమి సందర్భంగా కుషాయిగూడ పోలీసులు సూచనలు
తెలుగు నాడు, కుషాయిగూడ :
కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలయ కమిటీలు మరియు ఊరేగింపు కమిటీ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈనెల 6న జరగబోయే శ్రీరామనవమి పండుగ సందర్భంగా జరుగు కళ్యాణం మరియు ఊరేగింపు శాంతియుతంగా నిర్వహించడం మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులకు ఇన్స్పెక్టర్ తగు జాగ్రత్తలు సూచించారు. ఈ సమావేశంలో ఎస్సైలు సుధాకర్ రెడ్డి, వెంకన్న, శ్రీనివాస్, హనుమాన్ నాయక్ మరియు రాములు తదితరులు పాల్గొన్నారు.