కార్బన్ డయాక్సైడ్ వదిలే మొక్కలు కాకుండా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు పెంచండి.
తెలుగునాడు, కాప్రా :
కుషాయిగూడ ప్రధాన రహదారి మధ్యలో హరిత హారం పేరిట గత ప్రభుత్వం కోనో కార్పస్ మొక్కలను నాటడం జరిగింది. అయొక్క మొక్కలు పెరిగి పెద్దవయ్యి నేడు మహా వృక్షం లా తయారై నేడు కుషాయిగూడ ప్రజల ఆరోగ్యం మీద తీవ్ర చెడు ప్రభావం చూపుతున్నాయి. ఈ కోనో కార్పస్ చెట్ల వల్ల ఒక్క ఉపయోగం కూడా లేకపోవడమే కాకుండా ఈ చెట్లు విడిచే కార్బన్ డయాక్సైడ్ పీల్చడం వలన కుషాయిగూడ ప్రజలకు మరియు కుషాయిగూడ వర్తక వ్యాపారాలకు ఊపిరి తిత్తుల సమస్యలు మరియు గుండె సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయి అని తెలుసుకొని నేడు కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్ ఆధ్వర్యంలో కాప్రా మున్సిపల్ డిప్యుటీ కమిషనర్ జగన్ ని కలిసి ఈ యొక్క ప్రజల ఆరోగ్యలను దెబ్బ తీసే కోనో కోర్పస్ చెట్లను వెంటనే తొలగించి అట్టి ప్రదేశంలో మంచి అక్సీజన్ ఇచ్చే చెట్లను నాటవలసిందిగా కోరి వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు చల్లా ప్రభాకర్, కొడకండ్ల యాదయ్య, క్యాత దినేష్, కృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.