గవర్నమెంట్ డీగ్రీ కళాశాల విద్యార్థులకు అండగా మధుర చారిటబుల్ ట్రస్ట్

Facebook
X
LinkedIn

తెలుగు నాడు, హైదరాబాద్ :

మల్కాజిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ డివిజన్ లో గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మధుర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ డిగ్రీ విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, మల్కాజిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మరియు మధుర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి హాజరు కావడం జరిగింది.

ఉప్పల్ డివిజన్లో గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి గారు డిగ్రీ కళాశాలలో 37 కంప్యూటర్లు మరియు ఎల్ఈడి స్క్రీన్స్, వైట్ బోర్డ్స్, నోటీస్ బోర్డ్స్, కంప్యూటర్ చేర్స్, కబోర్డ్స్ మరియు, సిట్టింగ్ చైర్స్, టేబుల్స్ అందజేశారు.