తార్నాకలో శోభన్ బాబు జన్మదిన వేడుకలు_ నిర్వహించిన శోభన్ బాబు సేవా సమితి

Facebook
X
LinkedIn

తెలుగు నాడు, తార్నాక:
హైదరాబాద్ తార్నాక లో తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో నటభూషణం శోభన్ బాబు జన్మదిన వేడుక ను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శోభన్ బాబు జయంతికి ముఖ్యఅతిథిగా రావడం ఎంతో సంతోషకరము గా ఉన్నదని అన్నారు.సంక్రాంతి పండగ అయినప్పటికీ శోభన బాబు జన్మదినం సందర్భంగా అభిమానులు భారీగా రావడం సంతోషకరమని ఉన్నదన్నారు. తెలంగాణ, ఆంధ్ర అందగాడు శోభన్ బాబు అని కొనియాడారు. ఆయన సినిమాలు మహిళలు ఎంతగానో అభిమానమని, దాదాపు శోభన బాబు సినిమాలు మహిళల కోసమే అన్నట్లు
ఉండేవని శ్రీలత శోభన్ రెడ్డి కొనియాడరు . శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ తమ్మాలి రామకృష్ణ మాట్లాడుతూ శోభన్ బాబు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని జనవరి 18న రవీంద్రభారతిలో జరుగు కార్యక్రమానికి అందరూ సకుటుంబంగా వచ్చి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు సేవా సమితి కార్యవర్గ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ సభ్యులతో వచ్చి రవీంద్రభారతిలో జరుగు జన్మదిన కార్యక్రమం మరియు సన్మాన కార్యక్రమం తిలకించాలని కోరారు.