హైదరాబాద్ లో పబ్లిక్ ప్లేస్లో మద్యం తాగడం నిషేధం

Facebook
X
LinkedIn

రాచకొండ సి పి సుధీర్ బాబు

తెలుగు నాడు, హైదరాబాద్:

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ ప్లేస్లో మద్యం తాగడంపై నిషేధం విధించారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ఈ నిషేధం జనవరి 11 ఉ.6గం.ల నుంచి ఫిబ్రవరి 10 ఉ.6గం.ల వరకు అమల్లో ఉంటుందని ప్రజల భద్రత, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం సెక్షన్ 76 కింద కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.