పారిశ్రామికవేత్త కన్నెగంటి సతీష్ బాబుకు ఘన సన్మానం

Facebook
X
LinkedIn

తెలుగు నాడు, చర్లపల్లి :

అత్యాధునిక చర్లపల్లి శాటిలైట్ రైల్వే టెర్మినల్లో వంతెనలు, ప్లాట్ఫాంల నిర్మాణంలో కీలక భూమిక వహించిన పారిశ్రామికవేత్త కన్నెగంటి సతీష్ బాబు కృషి చర్లపల్లి పారిశ్రామికవాడకు వన్నెను తెచ్చాయని చర్లపల్లి ఫేస్ 3 పారిశ్రామికవాడ అధ్యక్షులు మియాపురం రమేష్ , ఉపాధ్యక్షులు మండా సురేష్ కుమార్ లు పేర్కొన్నారు.

గురువారం చర్లపల్లి ఫేస్ 3 పారిశ్రామివాడ సంక్షేమ సంఘం భవనంలో జరిగిన కార్యక్రమంలో సతీష్ ఇంజినీరింగ్ ఎంటర్ప్రైజెస్ అధినేత కన్నెగంటి సతీష్ బాబు ను పారిశ్రామికవేత్తలు ఘణంగా సన్మానించారు.

చర్లపల్లి రైల్వే టెర్మినల్లో పాదచారుల వంతెనలు, ప్లాట్ఫాంలు, ఇంటర్ మీడియట్ ఓవర్ హాలింగ్ లను నిర్మాణం చేసిన సతీష్బాబు కృషిని వారు అభినందించారు.

భవిశ్యత్తులో మరిన్ని ప్రాజెక్టులను పట్టాలని వారు ఆక్షాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం సభ్యులు శేషిరెడ్డి, బాబర్ ఆలి సునీల్ జింతుర్కర్, వెంకట్రామిరెడ్డి, కిరణ్, శివనాగరాజు తదితరులు పాల్గొన్నారు.