- గ్రామీణ ఆహార పదార్థాల ప్రదర్శనే లక్ష్యం
- తెలుగు నాడు, హైదరాబాద్ :
ఢిల్లీ ఇండియా ఎక్స్పోజిషన్ మార్ట్‌లో జరిగిన ‘ఇండస్‌ఫుడ్ 2025’లో ప్రీమియం వంట సామాగ్రి ఉత్పత్తుల్లో అగ్రగామి తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ పాల్గొంది. ఈ ఎక్స్పో జనవరి 8న ప్రారంభమైంది. ఈనెల 10వ తేదీ వరకు జరగనుంది. ఈ ఎక్స్‌పోలో 20 దేశాల నుంచి ఆహార ప్రాసెసింగ్ సంస్థలు, 1,800 పైగా ప్రదర్శకులు, 5,000 పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ఆహార పదార్థాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ వేదిక కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇండస్‌ఫుడ్ మన గ్రామీణ ఆహార సంస్కృతి గొప్పతనాన్ని, సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్ళే అవకాశాన్ని అందిస్తుందని చెప్పారు. ఇది మన గ్రామీణ వైద్యాన్ని గ్లోబల్ మార్కెట్లకు తీసుకువెళ్ళే ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. గత రెండేళ్లుగా ఇండస్ఫుడ్లో పాల్గొంటున్నామని తెలిపారు. ఆరోగ్యంపై మక్కువ కలిగిన వినియోగదారులు, భోజనప్రియులను ఆకట్టుకునే ఉత్పత్తులను ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా ప్రదర్శించామని చెప్పారు. గ్రామీణ ఆహారాన్ని, పోషక విలువను అంతర్జాతీయ భోజనాల్లోకి తీసుకురావడమే మా లక్ష్యమని తెలిపారు.
తెనాలి డబుల్ హార్స్ గురించి
తెనాలి డబుల్ హార్స్ 2005లో స్థాపించబడింది. తెనాలి డబుల్ హార్స్ నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అందిస్తుంది. అత్యుత్తమ ఉరద్ గోటా, ఉరద్ డాల్‌ను అందించడం ద్వారా ప్రతి గింజలో నమ్మకం, సంతృప్తిని కల్పించడానికి కట్టుబడి ఉంది. పప్పుల పరిశ్రమలో నమ్మకమైనదిగా పేరుగాంచింది. తెనాలి డబుల్ హార్స్ రైతులు, ప్రాసెసర్లు, గిడ్డంగి నిర్వహకులు, విక్రేతల ప్రయోజనాలను కాపాడటంలో ముందుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అత్యుత్తమ నాణ్యత కలిగిన పప్పులను అందించడంపై దృష్టి పెట్టడం వల్ల పంపిణీ నెట్‌వర్క్‌లో విశేష పురోగతిని సాధించాం. ఇది వినియోగదారుల ప్రియమైన ఎంపికగా గుర్తింపు పొందింది. తెనాలి డబుల్ హార్స్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. వివిధ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. నాణ్యత, నమ్మకం, సామాజిక బాధ్యత పట్ల దృఢ నిబద్ధతతో తెనాలి డబుల్ హార్స్ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను సృష్టిస్తుంది.