ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు ఎన్ వి భాస్కరరావు జయంతి

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్:

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కమలానగర్ ఆఫీసులో ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు ఎన్ వి భాస్కరరావు, మొట్టమొదటి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జయంతుల సందర్భంగా సంస్మరణ కార్యక్రమం జరిగింది. స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ప్రారంభ సూచికగా ఎన్వి భాస్కరరావు చిత్రపటానికి స్ఫూర్తి గ్రూపు సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఫాతిమా షేక్ చిత్రపటానికి ఆఫీస్ కార్యదర్శి శ్రీనివాసరావు, స్ఫూర్తి గ్రూపు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఎన్వి భాస్కర రావు హైదరాబాద్ నగరంలో ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మించారని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలలో నిజమైన పోరాట స్ఫూర్తిని కలిగించి అనేక ఉద్యమాల ద్వారా విస్తృతం చేశారని అన్నారు. కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దటంలో ఆయన చూపిన చొరవ ఎంతో స్లాఘనీయమైందని అన్నారు. ఆయన మరణించి 40 సంవత్సరాలు దాటిన ఇప్పటికీ ఆయన స్ఫూర్తిని కార్యకర్తలు నాయకులు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ మధ్యనే దాదాపు 40 మంది తమ అనుభవాలతో ఎనీ భాస్కర్ రావు గారి పై ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగిందని అది ఎంతో స్ఫూర్తివంతమైనదని అన్నారు. గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ ఫాతిమా షేక్ గారు జ్యోతిరావు పూలే,సావిత్రిబాయి పూలే లతో కలిసి స్వయంగా తను విద్యను అభ్యసించడం తర్వాత కాలంలో టీచర్గా తర్ఫీదు పొంది అనేక స్కూల్లు నిర్మాణానికి కృషి చేశారని చెప్పారు. దాదాపు 150 సంవత్సరాల ముందు మహిళలు చదువుకోవటం చేయకూడదని సమాజం కట్టడి చేసినప్పటికీ, ఇంకోపక్క ముస్లిం గా ఉన్నప్పటికీ చదువుకొని అనేకమందికి విద్యను, అందులోనూ బడుగు బలహీన వర్గాల పిల్లలకు చదువు చెప్పటం గొప్ప విషయం అని చెప్పారు. అనంతరం సభికులందరూ చిత్రపటాలకు పూలను వేసి నివాళులర్పించారు.

స్పూర్తి గ్రూపు ఆధ్వర్యంలో మేము సైతం.. వ్యాస సంకలనం ప్రచురించాలని నిర్ణయించడం జరిగింది. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లోనూ బస్తీలు రెండు కార్యక్రమాలు చేయాలని భావించటం జరిగింది.ఈ కార్యక్రమంలో గొడుగు యాదగిరిరావు, శ్రీమన్నారాయణ, శ్రీనివాసరావు, శారద, గౌస్య, శోభ, కృష్ణమాచారి, రుక్కయ్య, జయ ప్రకాష్, శివన్నారాయణ, వెంకటేశ్వరరావు, పి బీ చారి, శివప్రసాద్, గోపి తదితరులు పాల్గొన్నారు.