తెలుగునాడు, హైదరాబాద్ :
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను రోజూ వెంబడిస్తూ, ప్రేమించమని వేధిస్తూ, అక్రమంగా రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి లైంగిక దాడికి ప్రయత్నించిన సంఘటన Cr.NO 525/2019 కేసులో నిందితుడు కేశవపట్నం నవీన్ @ గోపి S/o లేట్ నర్సింహ, వయస్సు: 19 సంవత్సరాలు, కులం:- ఎస్సీ, వృత్తి:- బ్యాండ్ వర్క్ R/o జైపురి కాలనీ, నాగోల్, ఉప్పల్, మేడ్చల్ జిల్లా వాసికి పోక్సో చట్టం ప్రకారం రెండేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో U/S 448 354 323 IPC & SEC 11 R/w 12 ఆఫ్ పోక్సో చట్టం మరియు నాగోల్ స్టేషన్ SC NO 982/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం రంగారెడ్డి జిల్లా, ఎల్.బి.నగర్లోని గౌరవ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి గారు ఈ రోజు అనగా 09/01/2025 న నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి రెండేళ్ళ కఠిన కారాగార శిక్ష మరియు రూ.4,000/- జరిమానా విధించబడింది మరియు బాధితురాలికి రూ.50,000/- పరిహారం అందించబడింది. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి సునీత గారు వాదనలు వినిపించారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.