తెలంగాణ తల్లి అంటే ప్రజల భావోద్వేగం: సీఎం రేవంత్‌

Facebook
X
LinkedIn

హైదరాబాద్‌: తెలంగాణ తల్లి వేరు, దేవత వేరు కాదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి అని సీఎం చెప్పుకొచ్చారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో సంస్కృతి, సాంప్రదాయాలను తీసుకొచ్చామని తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా అని ప్రశ్నించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా సభలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. డిసెంబర్‌ 9 తెలంగాణ ప్రజలకు పర్వదినం. తెలంగాణ ఏర్పాటు పునాది పడిన రోజు. అమరుల త్యాగాలకు అనుగుణంగా సోనియా తెలంగాణ ప్రకటన చేశారు. 60 ఏళ్ల తెలంగాణ‍ ప్రజల ఆకాంక్షను సోనియా నెరవేర్చారు.