తెలుగు నాడు, కాప్రా
పూలే,అంబేద్కర్ స్ఫూర్తి గ్రూప్ ఎన్ ఎఫ్ సి వారిచే “మహా మనిషి డాక్టర్ ఏఎస్ రావు”డాక్యుమెంటరీ చిత్రానికి ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ విశాఖపట్నం వారిచే డాక్యుమెంటరీ ఫిల్మ్ గా అవార్డు రావడానికి కారణమై, చిత్రాన్ని నిర్మించిన డాక్టర్ ఎస్ రావు విజ్ఞాన వేదిక కార్యవర్గానికి అభినందిస్తూ కమలానగర్ సిఐటియు ఆఫీసు కాన్ఫరెన్స్ హాల్లో చేనేత వస్త్రాలతో గౌరవ సూచికంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కె మల్లేశం అధ్యక్షత వహించారు. ముందుగా డాక్టర్ ఏఎస్ రావు విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి పి.బి చారి డాక్టర్ ఏఎస్ రావు జీవిత విశేషాలను మరియు చిత్ర నిర్మాణానికి తోడ్పడిన కారణాలను విపులంగా వివరించారు. ఈసీఐఎల్ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఆర్థికంగా సహకారం అందించారు. మరియు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వినయ్ కుమార్ సహకారంతో దాశరధి ఫిలిం సొసైటీ బాధ్యులుగా ఉన్న బీడీఎల్ సత్యనారాయణ మరియు డైరెక్టర్ రఘురామచంద్ర వారి ఆధ్వర్యంలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా చిత్ర నిర్మాణం జరిగిందని చెప్పారు. ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ ఒడిస్సా వారు ఉత్తమ బయోపిక్ గా అక్టోబర్ 17వ తేదీన ఒడిస్సా భువనేశ్వర్ లో ఇవ్వడం జరిగింది. అలాగే డిసెంబర్ 29వ తేదీన ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ విశాఖపట్నం వారిచే ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ గా అవార్డు ప్రదానం చేయడం జరిగింది. దీనికంతటికి సహకారం అందించిన శ్రేయోభిలాషులు, డైరెక్టర్ రఘు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీడీఎల్ సత్యనారాయణ మరియు నటులు సాంకేతిక నిపుణులు కారణమని వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. డాక్టర్ ఎస్ రావు విజ్ఞాన వేదిక అధ్యక్షులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాణానికి కర్త కర్మ క్రియ పూర్తిగా తన భుజాన వేసుకొని పీ బీ చారి కృషి చేశారని అన్నారు. ఉపాధ్యక్షుడు జి శివరామకృష్ణ మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాణంలో నా వంతు కృషి చేశానని అందులో విక్రమ్ సారాభాయ్ పాత్ర నాతో వేయించినందుకు చాలా ఆనందపడ్డాను అని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ చల్లా లీలావతి మాట్లాడుతూ ఈ చిత్రం చాలా గొప్పగా తీయబడ్డదని అది అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పారు. సీనియర్ స్పూర్తి నాయకులు శ్రీమన్నారాయణ చిత్ర నిర్మాణం అద్భుతంగా జరిగిందని చెప్పారు. అనంతరం గౌరవ సూచికంగా డాక్టర్ ఏ ఎస్ రావు విజ్ఞాన వేదిక కార్యవర్గానికి చేనేత వస్త్రాలతో సన్మానించడం జరిగింది. ప్రధాన కార్యదర్శి పి బీ చారి ని మల్లేశం , ఉపాధ్యక్షులు జి శివరామకృష్ణ ని రవి ఆనంద్, సహాయ కార్యదర్శి కర్రె మల్లేశం ని కమలాకర్ రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ చల్లాలిలావతి ని నరసింహారావు, అధ్యక్షులు గొడుగు యాదగిరి ని బాలకృష్ణ చేనేత వస్త్రాలతో గౌరవపూర్వకంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా గోవింద రావు వ్యవహరించారు. భవిష్యత్తులో మరిన్ని డాక్యుమెంట్రీ ఫిలిమ్స్ నిర్మాణం చేయాలని అందులో హోమీ జే బాబా లాంటి వారిని జీవితాలను తీయాలని అధ్యక్షత వహించిన మల్లేశం కోరారు. ఈ సందర్భంగా చదువుల తల్లి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే కి నివాళులు అర్పించడం జరిగింది. వందల సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో కోమటి రవి, కే మల్లేశం, మల్లేష్, గోవింద రావు, నరసింహారావు, బాలకృష్ణ, బి యాదగిరి, శ్రీమన్నారాయణ, కర్రె మల్లేశం, రవి ఆనంద్, పి మల్లేశం, బాబు, సురేష్, సిహెచ్ లీలావతి తదితరులు పాల్గొన్నారు.