డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆనాథ విద్యార్థు లకు నోట్‌బుక్స్ పంపిణీ

Facebook
X
LinkedIn

హైదరాబాద్, :
ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు ఎల్‌బీ నగర్‌లోని ఆనాథ విద్యార్థి గృహంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటుగా 5,000 నోట్‌బుక్స్‌ను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించి, వారి చదువుకు ప్రోత్సాహం కల్పించారు. విద్య ప్రతి చిన్నారి హక్కు అనే భావనతో సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన మరియు అనాథ విద్యార్థులకు చేయూత అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం కావాలంటే సమాజం మొత్తం కలిసి వారికి అండగా నిలవాలని, విద్య, ఆరోగ్యం మరియు సామాజిక సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ఆనాథ విద్యార్థి గృహం యాజమాన్యానికి, దాతలకు, వాలంటీర్లకు మరియు సొసైటీ సభ్యులకు సొసైటీ ఎక్సగ్యుటీ డైరెక్టర్ జి.మాధవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.