ఆర్.సురేందర్ రెడ్డిని ప్రభుత్వ సలహదారుడిగా నియమించాలి

Facebook
X
LinkedIn

ముఖ్యమంత్రికి మైనారిట్స్ సెక్యులర్ ఫ్రంట్ విజ్ఞప్తి

హైద్రాబాద్ :
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఆర్ సురేందర్ రెడ్డి ని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులుగా నియమించాలని మైనార్టీస్ సెక్యులర్ ఫ్రంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. గురువారం ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఫ్రంట్ కన్వీనర్ కమల్ కొందుమెరిమాట్లాడుతూ సురేందర్ రెడ్డి ఎంపీగా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఆయన చేసిన కృషి అమోఘమైనదని ఆయన పేర్కొన్నారు ఇట్టి విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమార్లు వినతి పత్రాలు కూడా సమర్పించినట్లు ఆయన తెలిపారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సురేందర్ రెడ్డి సేవలను గుర్తించి ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఫ్రంటు ఉపాధ్యక్షులు షఫీ అకి ఖాన్, ప్రధాన కార్యదర్శి మజార్ పాష తదితరులు పాల్గొన్నారు.