హైదరాబాద్ రామకృష్ణ మఠంలో జూలై 24, 25 తేదీలో మంత్ర దీక్షలు

Facebook
X
LinkedIn

హైద్రాబాద్ :
ఈ నెల జూలై చివరి వారంలో బేలూరు రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ అధ్యక్షులు పూజ్యశ్రీ గౌతమానంద జీ మహారాజ్ హైదరాబాద్ రామకృష్ణ మఠం సందర్శిస్తున్న సందర్భంగా మూర్తిత్రయం భక్తులకు జూలై 24 మరియు 25 తేదీలు శుక్ర-శని వారాలు ఉదయం “మంత్ర దీక్షలు” ఇవ్వనున్నారు. హన్మకొండ సేవా సమితి నుండి ఎనమండుగురు భక్తులు సదరు స్వామీజీ నుండి మంత్ర దీక్ష స్వీకరించనున్నారు. దీక్షార్ధులు “మూర్తిత్రయ జీవిత చరిత్రలు, కథామృతం” తప్పనిసరిగా చదివి, నియమ-నిబంధనలు పాటించి 23వ తేదీ గురువారం సాయంత్రం లోగా హైదరాబాద్ రామకృష్ణ మఠం చేరుకోవాలని, హైదరాబాద్ రామకృష్ణ మఠంలోనే ఉచిత వసతి-అన్న ప్రసాద సౌకర్యాలు కల్పించ బడుతాయని, ఇతర భక్తులు స్వామీజీ దర్శనం చేసుకోవడానికి, వారి ఆశీస్సులు పొందడానికి 26 వ తేదీ ఉదయం 10 గంటలనుండి అవకాశం కల్పించ బడింది, వారికి అన్నప్రసాద సౌకర్యం ఉంటుందని, మంత్ర దీక్షార్దులు లేదా ఇతర భక్తులు వైరల్ ఫీవర్ లేదా ఇతరత్రా కారణాలతో బాధపడేవారు రాకూడదని, హనుమకొండ సేవా సమితి అధ్యక్షులు కటంగూరి సత్యనారాయణ రెడ్డి తెలియజేశారు.