యువతరం వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి

Facebook
X
LinkedIn

ఈసీ నగర్ లో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం

నేటి యువతరం వివేకానందుడుని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకి చేరుకోవాలని వివేకానంద జయంతి కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. స్వామి వివేకానందుడి 163వ జయంతి కార్యక్రమం ఈసీ నగర్ లో వెల్ఫేర్ అసోసియేషన్ సహా కార్యదర్శి గుమ్మడి హరిప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈసీ నగర్ హౌస్ బిల్డింగ్ కార్యదర్శి జగ్గరాజు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ సత్తిరెడ్డి, వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్, జాయింట్ సెక్రటరీ శరత్ తదితరులు ప్రసంగించారు. వివేకానంద ఆశయాలను నేటి సమాజానికి ఎంతో అవసరం అని, చిన్న నాటి నుంచే వివేకానంద సమాజసేవ నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవ అని నిరూపించారని తెలిపారు. ముందుగా పలువురు వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో హౌస్ బిల్డింగ్ డైరెక్టర్ బిక్షపతి, నవనీత, గోవర్ధన్, యాదయ్య రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.