మల్కాజిగిరి లో టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 3వ మహాసభ

Facebook
X
LinkedIn

పోస్టర్ ఆవిష్కరించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి :

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 3వ మహాసభ మల్కాజిగిరి నియోజకవర్గం నెరేడ్ మెట్ లో ఈ నెల 14న జరుగనున్నాయి. ఈ సందర్బంగా బుధవారం మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్డాడుతూ మహాసభ విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూ జేఎఫ్ జిల్లా కన్వీనర్ జి హరి ప్రసాద్, కో కన్వీనర్ పి మల్లేష్ గౌడ్, సీనియర్ జిల్లా నాయకురాలు రోజా రాణి, దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.