ఎస్టీ హాస్టల్స్ లో 16 నెలలుగా చెల్లించని మెస్ బిల్లులు.. మూసివేసి దశగా హాస్టళ్ళు

Facebook
X
LinkedIn

                  28 నెలలుగా చెల్లించని హాస్టల్ అద్దె భవనాలు అద్దె

బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు రాజ్యసభ సబ్యులు ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్ :

గత 16 నెలలుగా ఎస్టీ హాస్టల్స్ లో మెస్ బిల్లులు చెల్లించడం లేదని, అలాగే .. 28 నెలలుగా హాస్టల్ అద్దె భవనాలు అద్దె చెల్లించడం లేదని,దీనితో  హాస్టళ్ళు మూసివేసి దశ లో ఉన్నాయని బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు , రాజ్యసభ సబ్యులు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షులు నీలా వెంకటేష్ తో కలిసి మాట్లాడారు.16 నెలల నుంచి రాష్ట్రంలోనే ఎస్టీ హాస్టల్స్, మెస్ బిల్లులు కూరగాయల చిల్లులు నిత్యవసర వస్తువులు చిల్లులు డబ్బులు చెల్లించబడలేదు. దీని మూలంగా హాస్టల్లో నిర్వహింది లేక ఇబ్బంది గురియితునారు హాస్టల్ వార్డెన్లు విద్యార్థులు ఇబ్బంది కలగకుండా అప్పులు తెచ్చి హాస్టల్లోనూ అతి కష్టంగా నిర్వహిస్తున్నారు కానీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత గల ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం లేదు అప్పులకు వడ్డీలు కట్టలేక కూరగాయలు మాంసం గుడ్లు ఇతర నిత్యవసర వస్తువులు సప్లై చేసిన వారికి డబ్బులు ఇవ్వక పోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నరు..ఎస్సీ/ఎస్టీ/బీసీ హాస్టల్ అని అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి అద్దె భవనాలు యజమానులకు గత 28 నెలలుగా అద్దె బిల్లులు చెల్లించడం లేదు టోకెన్లు కూడా జారీ చేశారు కానీ బిల్లులు పాస్ చేయడం లేదు దీని మూలంగా ట్యాంకులో అప్పులు తెచ్చి భవనాలు కట్టిన వారికి బ్యాంకు చేస్తులు కట్టకపోవడంతో బ్యాంకుల భవనాలు స్వాధీనం చేసుకొని వేలం వేస్తాం అంటున్నారు.రాష్ట్రంలో ఎస్టీ కాలేజ్ హాస్టల్ లో సరిపోను లేక హాస్టల్ సీట్లు దొరకక చాలామంది గిరిజన బిడ్డలు చదువు కు దురమవుతున్నారన్నారు.50 ST కాలేజీ హాస్టల్స్, 100 BC కాలేజీ హాస్టల్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేసారు.ee సమావేశం లో గుజ్జ కృష్ణ,అనంతయ్య,నంగగోపాల్,శివకుమార్ యాదవ్,రవి యాదవ్,నరేష్ గౌడ్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.