విద్యారంగంలో విశిష్ట సేవలకు గాను శంకర్ యాదవ్ అరుదైన గుర్తుంపు

Facebook
X
LinkedIn

  “ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు” ను ప్రదానం చేసిన యాదవ సంఘం

హైదరాబాదు :

విద్యారంగంలో విశిష్ట సేవలకు గాను శంకర్ యాదవ్ కు  అరుదైన గుర్తుంపు లబించింది. రెండు తెలుగు రాష్ట్రాల యాదవ్ సంఘాల తరపున ఆయనకు  “ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు” ను ప్రదానం చేసిన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ స్వామినారాయణ గురుకుల యాజమాన్యం శంకర్ యాదవ్ గారిని అభినందిస్తూ, “మా సంస్థలో ఇలాంటి అద్భుతమైన అధ్యాపకులు సేవలందించడం మన సంస్థకు గర్వకారణమని పరమ పూజ్య సుఖ్ వల్లభ దాస్ జీ స్వామీజీ ,పరమ పూజ్య హరి వల్లభ దాస్ జీ స్వామీజీ , పరమ పూజ్య విశ్వదర్శన్ స్వామీజీ  పాఠశాల సీఈఓ  సతీష్ రెడ్డి గారు మరియు ప్రిన్సిపాల్ ఆర్. కె. ప్రవీణ్ కుమార్ గార్లు శంకర్ యాదవ్ కు అభినందనలు తెలిచేసారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న తపన అందరికీ స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్.బి.కృష్ణ యాదవ్ మరియు యాదవ సంఘ పోరాట సమితి, జాతీయ అధ్యక్షులు రాములు యాదవ్, సంఘము అధ్యక్షులు అల్లాడి శరత్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం   శంకర్ యాదవ్   మాట్లాడుతూ “ఈ గౌరవం నాకే కాదు, నా విద్యార్థులకు, సహచరులకు, మరియు నన్ను ప్రోత్సహించిన అందరికీ చెందింది” అన్నారు.సహచర అధ్యాపకులు, విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలియచేసారు