వేల కోట్ల డ్రగ్స్‌ సీజ్‌

Facebook
X
LinkedIn

చర్లపల్లి ప్రారిశ్రామి వాడలో డ్రగ్స్‌ తయారి

డ్రగ్స్‌ తయారీ గుట్టురట్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు
హైదరాబాద్‌ చర్లపల్లి ల్యాబ్‌పై మహారాష్ట్ర పోలీసుల దాడి
రూ.12 కోట్ల విలువైన మెఫెడ్రిన్‌ స్వాధీనం
ఇద్దరు అరెస్ట్‌ – దేశవ్యాప్తంగా సరఫరా నెట్వర్క్‌ బహిర్గతం

హైదరాబాద్‌, చర్లపల్లి :
నగరంలో మరో భారీ డ్రగ్స్‌ తయారీ గుట్టు రట్టయింది. చర్లపల్లిలోని ఓ ల్యాబొరేటరీలో మత్తు పదార్థం మెఫెడ్రిన్‌ తయారు చేస్తున్న ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరిశ్రమలో రూ.12 కోట్ల విలువైన 5.96 కిలోల మెఫెడ్రిన్‌, 35,500 లీటర్ల రసాయనాలు, డ్రగ్స్‌ తయారీ పరికరాలు, 950 కిలోల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసిన నిందితులను శనివారం ముంబయికి తరలించారు.
మహారాష్ట్రలోని లిమీరా భయాందార్‌, వసాయ్‌ విరార్‌ కమిషనరేట్‌ పోలీసులు ఆగస్టు 8న బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ ఫాతిమా మురాద్‌ షేక్‌ అలియాస్‌ మొల్లా (23) వద్ద 105 గ్రాముల మెఫెడ్రిన్‌ పట్టుకున్నారు. విచారణలో మరో 10 మందిని అరెస్ట్‌ చేసి రూ.23.97 లక్షల విలువైన 178 గ్రాముల మెఫెడ్రిన్‌, కార్లు, మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ దర్యాప్తులో హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి డ్రగ్స్‌ వస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.+


చర్లపల్లిలో దాడి
మీరా భయాందార్‌ సీపీ నిఖేష్‌ కౌశిక్‌ ఆదేశాలపై ఇన్‌స్పెక్టర్‌ ప్రమోద్‌ బృందం హైదరాబాద్‌కి చేరింది. చర్లపల్లి ఫేజ్‌-5, నవోదయ కాలనీలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్‌ పై ఆకస్మిక దాడి జరిపింది. అక్కడే డ్రగ్స్‌ తయారీ యూనిట్‌ నడుస్తున్నట్లు బయటపడిరది.
అరెస్టైన వారు
వోలేటి శ్రీనివాస్‌ విజయ్‌ (రాంనగర్‌ గుండు)
తానాజీ పండరీనాథ్‌ పట్వారీ
ఇద్దరినీ అరెస్ట్‌ చేసి ట్రాన్సిట్‌ వారెంట్‌ తీసుకుని ముంబయికి తరలించారు.
నాలుగేళ్ల క్రితం లీజు
శ్రీనివాస్‌ విజయ్‌ గతంలో ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో పనిచేశాడు. నాలుగేళ్ల క్రితం చర్లపల్లి నవోదయ కాలనీలోని ఓ భవనాన్ని లీజుకు తీసుకుని ఫార్మా ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లులి స్థానికులకు నమ్మబలికాడు. కానీ గుట్టుగా మెఫెడ్రిన్‌ తయారీకి యూనిట్‌ను వాడుతున్నాడు.
దేశవ్యాప్తంగా సరఫరా – విదేశీ లింకులు అనుమానం
ఈ డ్రగ్స్‌ మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడిరచారు. వీరికి విదేశీ లింకులు ఉన్నాయనే అనుమానంతో దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతోంది.