ప్రజావాణిలో స్వీకరించిన ధరఖాస్తులను పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు

Facebook
X
LinkedIn

మేడ్చ‌ల్‌-మ‌ల్కాజ్‌గిరి జిల్లా :
ప్రజావాణిలో స్వీకరించిన ధరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ జాప్యం లేకుండా సత్వరమే అర్జీలను  పరిశీలించి పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు మిక్కిలినేని మను చౌదరి  అధికారులను ఆదేశించారు.
  సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అదనపు కలెక్టర్లు రాధికగుప్తా, విజయేందర్ రెడ్డి లతో కలిసి కలెక్టరు (88) దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరు  మాట్లాడుతూ ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చుకొని వారి సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకంతో ప్రజలు మన వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని అన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని దరఖాస్తుల పరిశీలనలో ఏలాంటి జాప్యం ఉండకూడదని కలెక్టరు అన్నారు. అదేవిధంగా తిరస్కరించే దరఖాస్తుల గురించి తిరస్కరణకు గల కారణాలను తప్పనిసరిగా  వివరంగా అర్జీదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల  వివరాలను ఆన్ లైన్ లో వెంట వెంట నమోదు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టరు సూచించారు. ఈ కార్యక్రమంలో dro హరిప్రియ వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.