దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రగతి నగర్ కాలనీలోఘనంగా గణేష్ నవరాత్రి వేడుకలు

Facebook
X
LinkedIn

మేడ్చల్ :

మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రగతి నగర్ కాలనీలోఘనంగా గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ప్రగతి నగర్ కాలనీలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ బిజెపి జిల్లా నాయకులు గాలి సంపత్ యాదవ్ పాల్గొని  అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంబించారు. ప్రగతి నగర్ కాలనీలోని పెద్దలు శ్రీ కృష్ణ కిషోర్ మరియు నరసింహారెడ్డి, గంగానాయక ECIL బిఎంఎస్ ఉపాధ్యక్షులు, సంగారెడ్డి ల ఆహ్వానం మేరకు గాలి సంపత్ యాదవ్ గణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా  గాలి సంపత్ యాదవ్ మాట్లాడుతూ..వినాయక చవితి పర్వదినం నుండి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజల్లో మతసామారస్యం దైవభక్తి సమిష్టి తత్వం మరింతగా బలపడాలని సత్కార్యాలన్ని ఎటువంటి విఘ్నూలు లేకుండా ప్రతీ ఒక్కరి కుటుంబంలో  విజయవంతం కావాలని గణనాధుని కృపాకటాక్షాలు ప్రతీ ఒక్కరిపైన ఉండాలని మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నూలు కలగకుండా ఆ గణపయ్య మిమ్మల్ని అనుగ్రహించాలని ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖశాంతులు వెళ్లి విరిసేలా దీవించాలని ఆ విఘ్నేశ్వరుడిని మనసారా ప్రార్థిస్తున్నాను అని అన్నారు,  తధానంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు,తదుపరి కాలనీవాసులు నూతన డైరీని బహుకరించారు, ఈ సందర్భంగా కాలనీవాసులందరికి  శుభాభివందనములు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు బిలకంటి ధర్మేందర్, ప్రధాన కార్యదర్శి తడక కృష్ణ, కాలనీవాసులు చిటుకల నరసింహారెడ్డి, ఒ. కృష్ణ కిషోర్, వెంకట్ ప్రసాద్, సంతోష్, విశ్వనాథ్, గంగా నాయక, ఆగస్త్యా ప్రైముస్ అపార్ట్మెంట్ మహిళా మణులు తదితరులు పాల్గొనడం జరిగింది.