గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మధుయాష్కీ గౌడ్

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ గారు పేర్కొన్నారు.   మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలను శుక్రవారం హయత్ నగర్ లోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు.  ముఖ్యఅతిథిగా హాజరైన మధుయాష్కీ గౌడ్ గారు మాట్లాడుతూ..     కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ  క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అధిక నిధులు ఖర్చు పెడుతుందని వివరించారు. గత బి ఆర్ ఎస్ పాలనలో క్రీడలు,  క్రీడాకారులను నిర్లక్ష్యానికి గురి చేశారని పేర్కొన్నారు. ఎవరెస్ట్ ఎక్కిన యువకుడు తుకారాంకు గత ప్రభుత్వం ప్రోత్సాహంకం ఇవ్వకుండా అవమానం చేసిందని, అతను ఆత్మహత్యాయత్నాన్ని కూడా ప్రయత్నించడం బాధాకరమన్నారు. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో క్రీడాకారులకు అన్యాయం జరగదు అన్నారు. అడ్వెంచర్ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేలా క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి  తీసుకువెళ్తామని పేర్కొన్నారు.  యువతను క్రీడలను వైపు మళ్లించడం ద్వారా .. మత్తు పానీయాలు లాంటి  చెడు వ్యసనాలకు దూరం చేయవచ్చునని పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం  క్రీడా కేంద్రాల పేర్లు మార్చింది తప్ప నిధులను కేటాయించలేదని పేర్కొన్నారు.  పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కలిసి గ్రామీణ స్థాయిలో స్పోర్ట్స్ స్టేడియాలు, క్రీడా పరికరాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అడ్వెంచర్ క్రీడలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు  అవార్డులను ప్రధానం చేసి అభినందించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ టి. ఐజయ్య, అబ్దుల్లాపూర్మెట్ ఎంపీడీవో శ్రీవాణి, అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ సెక్రెటరీ  రంగారావు, మేరా యువ భారత్ జిల్లా అకౌంట్ ఆఫీసర్  నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.