సాంకేతిక ఆధారాలతో చెరువులను ఎఫ్ టిఎల్ మార్కు చేస్తున్నాము
చెరువులతో పాటు నాలాలను నోటిఫై : హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ :
హైడ్రాపై ప్రజలకు మరింత క్లారిటీ రావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వందేళ్ల ప్రణాళికతో హైడ్రా ముందుకు వెళ్తోందని అన్నారు. బషీర్ బాగ్ లో రంగనాథ్ మీడియాతో మాట్లాడారు..ప్రస్తుతం ఆరు చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, హైడ్రా.. ఒకటి, రెండేళ్లకు పరిమితం కాదని చెప్పారు. సిఎస్ఆర్ పేరుతో చెరువులను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. సాంకేతిక ఆధారాలతో చెరువులను ఎఫ్ టిఎల్ మార్కు చేస్తున్నామని తెలియజేశారు. చెరువుల వద్ద భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయని, చెరువులతో పాటు నాలాలను నోటిఫై చేస్తున్నామని కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.