రంగారెడ్డి జిల్లా :
రంగారెడ్డి జిల్లా, గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో లంచం కేసు బట్టబయలైంది. గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి ఎస్‌ఐ వేణుగోపాల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సిటీ రేంజ్–1 ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం— కుటుంబ కలహాల కేసులో సయోధ్య కుదుర్చడం కోసం ఎస్‌ఐ రూ.25 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో శుక్రవారం డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. లంచం తీసుకుంటుండగా ఎస్‌ఐని పట్టుకుని కేసు నమోదు చేశారు.
వేణుగోపాల్ ఇటీవలే ప్రమోషన్ పొంది ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించగా, కొద్దికాలంలోనే అవినీతి వలలో చిక్కుకున్నాడు.