దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసిన
హైదరాబాద్ :
రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ నగరం నలు వైపులా వరద పోటెత్తింది. కూకట్పల్లి, ఖైరతాబాద్, బేగంపేట్ వైపు నుంచి వరద నీరు భారీగా హుస్సేన్ సాగర్‌కు వచ్చి చేరింది. దీంతో హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది.హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 514 మీటర్లు కాగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు సాగర్ నీటిమట్టం 513.63 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌కు 1234 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఔట్ ఫ్లో 1523 క్యూసెక్కులుగా ఉంది. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.