తెలుగునాడు, హైదరాబాద్ :
చర్లపల్లి డివిజన్ ఈసీ నగర్లో ఈసీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఆటల పోటీలను ఈసీ నగర్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జగ్గరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్గరాజు మాట్లాడుతూ యువతరం ఆటల పోటీలతో పాటు అన్ని రంగాలలో ముందు ఉండాలని ఆకాంక్షించారు. నేడు ప్రపంచంలోకెల్లా మన దేశంలోనే యువతరం దాదాపు 70 శాతం ఉన్నారని తెలిపారు. యువతరం భారతదేశ ప్రగతిని అభివృద్ధిని కాంక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ వరప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈసీ నగర్ వెల్ఫేర్ ఆఫీస్ ఆవరణ గ్రౌండ్ లో ఆటల పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కబడ్డీ, షటిల్, టెన్నికాయిట్, చెస్, క్యారమ్స్ తదితర ఆటలు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 150 మంది పోటీలకు పేర్లు ఇచ్చారని వారందరితో పోటీలు నిర్వహించి విజేతలకు ఆగస్టు 15 తేదీన జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో బహుమతులు అందిస్తామని తెలిపారు. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ సత్తిరెడ్డి మాట్లాడుతూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవరణ లో ఎప్పుడు వివిధ రకాల ఆటలు పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. తద్వారా యువతరం తమలోని నైపుణ్యం ను వెలికి తీయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హౌస్ బిల్డింగ్ డైరెక్టర్ బిక్షపతి, వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి ఎం మల్లేష్, కోశాధికారి పి బాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎం నాగరత్నం, సహాయ కార్యదర్శి జి హరిప్రసాద్, వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, ఆటల పోటీల ఇంచార్జ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
