బీసీ రిజర్వేషన్లపై ధర్నా చేస్తున్న బిజెపి నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
హైదరాబాద్ :
42 శాతం రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తా మని మంత్రి పొన్నం ప్రబాకర్ స్పష్టం చేసారు.ప్రజా పాలన ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ నుండి మొదలు కుల గణన చేసి న్యాయపరమైన చిక్కులు లేకుండా బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ శాసనసభ ద్వారా చట్టం చేసి గవర్నర్ కి పంపించి అక్కడినుండి రాష్ట్రపతికి పంపించడం వరకు మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాంరాష్ట్రపతి ఆమోదం పొందాల్సిన ఈ బిల్లు పై బిజెపి కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకునే ప్రయత్నం చేస్తున్నారుశాసన సభ లో బీసీలకు రిజర్వేషన్లపై మద్దతు ఇచ్చి ముస్లింల పేరు మీద అడ్డుకుంటున్నారుకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పులు ఉంటే సవరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆమోదింపజేయాలిబీసీ లకు న్యాయం చేయాలిబలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు చేసే ధర్నాలు మీరు పాల్గొని మీరు కూడా బలహీన వర్గాల వ్యతిరేకి గా మారుతున్నారుబిజెపి నేతలు బీసీలు రిజర్వేషన్లు సాధించాలనుకుంటే ఈ ధర్నా ఢిల్లీలో చేయాలి ప్రధాని మోడీని ఒప్పించండిఈ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుందితెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఏర్పాటు చేసుకొని రాష్ట్రాన్ని సాధింకున్నామో ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేయడానికి బీసీ సంఘాలు మేధావులు కదలాలిరేపు 4 తారీఖు అందరం ఢిల్లీ వెళ్దాం రండి మన రిజర్వేషన్లు సాధించుకుందాంబీజేపీ అధ్యక్షడు రామచంద్రరావు ధర్నా చేయాల్సింది హైదరాబాద్ లో కాదు ఢిల్లీ లో చేయాలికేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధర్నా చౌక్ లో కూర్చుంటున్నారుమీరు ప్రధాన మంత్రి కి ఒక్క మాట చెప్తే తెలంగాణ లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయిబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పక్కా బీసీ ల వ్యతిరేకికామారెడ్డి డిక్లరేషన్ నుండి కుల గణన , బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చట్టం చేసి గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతి పంపేవరకు మేము మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాంముస్లిం ల పేరు చెప్పి రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారుకడుపులో కత్తులు పెట్టుకొని అలుముకున్న విధంగా బీజేపీ నేతలు చూస్తున్నారుతెలంగాణ యావత్ బీసీ నేతలు,కుల సంఘాలు ఐక్యం కావాలి మన హక్కుల కోసం కోట్లడాలి సాధించుకోవాలిబీజేపీ నేతలు మీ స్థాయిని ధర్నా చౌక్ దగ్గరకు తీసుకోకండి.. మాతో కలిసి ఢిల్లీ రండికేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ నేతలు ధర్నా చేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు.