79 మంది విద్యార్థినులు అస్వస్థత..ఆసుపత్రికి తరలించారు
నాగర్కర్నూల్ :
రాష్ట్రంలోని మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో ఉన్న మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 79 మంది బాలికలను పాఠశాల సిబ్బంది దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు. 12 మంది డిశ్చార్జి అవగా, ఇంకా 67 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. పూర్తిగా తోడుకోని పెరుగు తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తున్నది.