కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

Facebook
X
LinkedIn

సూర్యాపేట :

సూర్యాపేట జిల్లా మెల్ల చెర్వు మండలం రామాపురం గ్రామంలో ఒక షెడ్ లో కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సాయం తో అరెస్టు చేసారు…మేళ్లచెరువు మండలం రాంపురం గ్రామానికి చెందిన తోట శివ శంకర్ అను వ్యక్తి సూర్యప్రకాష్ అను వ్యక్తి ఇల్లు మరియు షెడ్ లో సుమారు 832 లీటర్ల స్పిరిట్ ను నిల్వ ఉంచారు…ఖాళి బాటిల్స్ లో స్పిరిట్ ను నింపి క్యాప్స్ బిగించి నకిలీ లేబుళ్ల ని అతికించి అమ్మే ప్రయత్నం చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేర కు హైదరాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సూపరిండెంట్ అంజి రెడ్డి ఆధ్వర్యం లో హుజూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది తో కలసి సంయుక్తం గా దాడులు నిర్వహించారు..ఈ దాడుల లో 832 లీటర్ల స్పిరిట్ తో పాటు 326 లీటర్ల బాటిల్ లో నింపబడిన 38 కాటన్ల mc విస్కీ బాటిల్స్ ను నకిలి లేబుల్స్ మరియు ఎక్సైజ్ హీల్స్ తో పాటు స్వాధీనం చేసుకున్నారు..