చర్లపల్లి-ధర్మవరం మధ్య 14 ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

చర్లపల్లి-ధర్మవరం మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. చర్లపల్లి-ధర్మవరం (07003) రైలు ప్రతి ఆదివారం నడుస్తుందని, ఆయా రోజుల్లో రాత్రి 7.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. ధర్మవరం-చర్లపల్లి (07004) రైలు సోమవారం సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు సాయంత్రం 6.30 గంటలకు చర్లపల్లికి చేరుతుందని వివరించింది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, కలికిరి, మదనపల్లె, కదిరి స్టేషన్లలో ఆగుతుందని పేర్కొంది. ఈ రైలులో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పింది.